శేఖర్ కమ్ములతో సెట్స్ పైకి వచ్చేసిన చైతూ, సాయిపల్లవి
- శేఖర్ కమ్ముల నుంచి మరో చిత్రం
- చైతూ జోడీగా సాయిపల్లవి
- ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్
నాయకా నాయికల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. శేఖర్ కమ్ముల కథలు లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుని ఉంటాయి. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగనుందని అంటున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.