19వ గ్రాండ్ స్లామ్... యూఎస్ ఓపెన్ గెలిచిన రఫెల్ నాదల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

19వ గ్రాండ్ స్లామ్... యూఎస్ ఓపెన్ గెలిచిన రఫెల్ నాదల్!

  • మెద్వెద్వెవ్ పై విజయం
  • ఐదు సెట్లు సాగిన పోరు
  • ఫెదరర్ రికార్డుకు ఒక అడుగు దూరంలో నాదల్
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, తన కెరీర్ లో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకున్నాడు. యూఎస్ ఓపెన్ లో భాగంగా జరిగిన ఫైనల్ పోరులో రష్యాకు చెందిన డానియల్ మెద్వెద్వెవ్ ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఓడించాడు. ఐదు సెట్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో తొలి రెండు సెట్లనూ నాదల్ గెలుచుకోగా, మూడు, నాలుగు సెట్లలో మెద్వెద్వెవ్ సత్తా చాటాడు. ఇక నిర్ణయాత్మక ఐదో సెట్ లో నాదల్ రెచ్చిపోయి ఆడి, విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డు రోజర్ ఫెదరర్ (20) పేరిట ఉండగా, దానికి ఒక్క అడుగు దూరంలో నాదల్ నిలిచాడు.
Rafele Nadal
US Open
Grandslam

More Telugu News