వధూవరులకు హెల్మెట్లను కానుకగా ఇచ్చిన స్నేహితులు

  • చెన్నైలో ఘటన
  • స్నేహితుడి పెళ్లికి వినూత్న బహుమతి
  • అభినందించిన బంధువులు
ప్రస్తుతం దేశ్యాప్తంగా హెల్మెట్లు, ట్రాఫిక్ రూల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో స్నేహితుడి పెళ్లికి హాజరైన అతడి మిత్రులు వధూవరులకు హెల్మెట్లు గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆలోచింపజేశారు. చెన్నైలో జరిగిందీ ఘటన. ఆవడి ప్రాంతంలోని కల్యాణ మండపంలో మోహన్-విశాలిల వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు. వేడుకకు హాజరైన వరుడి తరపు స్నేహితులు వారికి రెండు హెల్మెట్లు గిఫ్ట్‌గా ఇచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్లు ఇచ్చి వారి భద్రత తమకెంత ముఖ్యమో తెలియజెప్పిన స్నేహితులను పెళ్లికొచ్చిన వారు అభినందించారు.
Go Back to Shorts
chennai
helmet
marriage

More Telugu News