గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు
- ఆయన నివాసానికి వెళ్లి సత్కారం
- మిఠాయి తినిపించి అభినందనలు
- తెలంగాణ ముద్దుబిడ్డకు గవర్నర్ పదవి దక్కడంపై ఆనందం
తెలంగాణ ముద్దుబిడ్డకు గవర్నర్ పదవి దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చే అంశమని, ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను ఈరోజు ఆయన ఇంట్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి సత్కరించిన అనంతరం మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దత్తాత్రేయతో తనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.