యాదాద్రి గుడిపై కేసీఆర్ బొమ్మలు... వివరణ ఇచ్చిన ఆలయ అధికారి కిషన్ రావు
- యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మలపై విపక్షాల ఆగ్రహం
- ఆలయాల్లో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా బొమ్మలు చెక్కడం సహజమేనన్న అధికారి
- కేసీఆర్ బొమ్మలు చెక్కాలని శిల్పులకు తాము చెప్పలేదంటూ స్పష్టీకరణ
అయితే, ప్రత్యేకంగా ఫలానా బొమ్మలు చెక్కాలని తాము శిల్పులకు చెప్పలేదని, ఎవరి బొమ్మలు చెక్కాలనేది శిల్పుల ఇష్టమని తెలిపారు. కేవలం బాహ్య ప్రాకారంలోనే ఈ బొమ్మలున్నాయని, ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కిన బొమ్మలు కావని కిషన్ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కోసమే చెక్కించామని అనడం సరికాదని అన్నారు. వీటిపై అభ్యంతరాలు వస్తే మార్పులు చేస్తామని అన్నారు.
