బిగ్ బాస్ హౌస్ లో పురివిప్పిన భావోద్వేగాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ హౌస్ లో పురివిప్పిన భావోద్వేగాలు!

  • కంటెస్టెంట్లకు ఇంటి నుంచి సందేశాలు
  • కన్నీళ్లు పెట్టుకున్న శివజ్యోతి, రవికృష్ణ, బాబా భాస్కర్, వితిక
  • శుక్రవారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్
బిగ్ బాస్ రియాల్టీ షో అంటే భావోద్వేగాలకు నెలవు అని చెప్పాలి. కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు దూరంగా ఉండాల్సి రావడం వారిని ఓ ప్రత్యేకమైన స్థితికి చేర్చుతుంది. దాంతో, తమ వారి ప్రస్తావన రాగానే హౌస్ మేట్లలో ఎమోషన్స్ ఉప్పొంగుతాయి. తాజాగా, బిగ్ బాస్-3 హౌస్ లో కూడా అలాంటి వాతావరణమే ఏర్పడింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి సందేశాలు వచ్చాయి. తమవారు పంపించిన లేఖలు చూసుకుని హౌస్ మేట్స్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. శివజ్యోతి, రవికృష్ణ, వితిక, బాబా భాస్కర్ తదితరులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్ కు బిగ్ బాస్ కాస్తంత ఎమోషనల్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు.
Bigg Boss-3
Andhra Pradesh
Telangana

More Telugu News