ఉండవల్లి శ్రీదేవి ఓ క్రిస్టియన్... అట్రాసిటీ కేసు ఎలా పెడతారు?: మాజీ మంత్రి జవహర్
- వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై జవహర్ విమర్శలు
- ఉండవల్లి శ్రీదేవి దళితురాలు కాదంటూ వ్యాఖ్యలు
- ఆమెపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలంటూ విజ్ఞప్తి
శ్రీదేవి కులంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, ఈసీకి కూడా ఆమెపై ఫిర్యాదులు వెళ్లాయని తెలిపారు. ఓట్లు వేయించుకుని ప్రజల్ని మోసం చేసి, ఇప్పుడు దేవుడ్ని కూడా మోసగించారని మండిపడ్డారు. దళితురాలు కాని శ్రీదేవిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని జవహర్ విజ్ఞప్తి చేశారు.