తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ.. డిసెంబరు నెల కోటా టికెట్లు విడుదల

  • మొత్తం 68,466 టికెట్లు
  • ఎలక్ట్రానిక్‌ విధానంలో 6,516
  • కరెంటు బుకింగ్‌ కింద 61,950
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి డిసెంబరు నెల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మొత్తం 68,466 టికెట్లు విడుదల చేయగా వీటిలో 6,516 టికెట్లు ఎలక్ట్రానిక్‌ విధానంలోను, మరో 61,950 టికెట్లు కరెంటు బుకింగ్‌ కింద భక్తులకు కేటాయించనున్నారు. ఎలక్ట్రానిక్‌ బుకింగ్‌ టికెట్లలో నిజపాద దర్శనం కోసం 2,300, అష్టాదళ పాద పద్మారాధనకు 240, సుప్రభాత సేవకు 3,856, తోమాల సేవకు 60, అర్చనకు 60 టికెట్లు కేటాయించారు. ఇక, కరెంటు బుకింగ్‌ కింద విడుదల చేసిన 61,950 టికెట్లలో సహస్ర దీపాలంకరణ కోసం 17,400, వసంతోత్సవం కోసం 15,950, కల్యాణోత్సవం కోసం 13,775, ఆర్జిత బ్రహ్మోత్సవం  కోసం 7,975, ఊంజల్‌ సేవకు 4,350, విశేష పూజకు 2,500 టికెట్లు కేటాయించారు.
Go Back to Shorts
TTD
seva tickets
december month

More Telugu News