25 ఏళ్ల వయసులోనే జైన ఉపవాసం... దీక్ష చేస్తూ ప్రాణాలు వదిలిన ఏక్తా అశూభాయ్!

  • ఏడు రోజుల ఉపవాస దీక్ష
  • ఆరోగ్యం విషమించి గుండెపోటు
  • గుజరాత్ లో ఘటన
జైన సంప్రదాయాన్ని నిష్ఠతో పాటించే ఓ యువతి, ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష తరువాత ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే, ఏక్తా అశూభాయ్‌ (25), గత నెల 27న వారం రోజుల ఉపవాస దీక్షను చేసేందుకు నిర్ణయించుకుని, గుజరాత్‌ లోని కచ్‌ లో ఉన్న పుట్టింటికి చేరుకుంది. ఐదు రోజుల దీక్ష తరువాత, ఆమె ఆరోగ్యం క్షీణించగా, తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఆహారం తీసుకోవాలని సూచించగా, నిరాకరించింది. కనీసం రోజుకు ఒక్కసారైనా ఆహారం తీసుకోవాలని చెప్పినా వినలేదు. దీంతో ఆమెకు వైద్యులు గ్లూకోజ్ ఎక్కించారు. అయినా పట్టు వదలని ఆమె, జైన విశ్వాసాల ప్రకారం, వేడి చేసిన నీరు మాత్రమే తాగుతూ వచ్చింది. ఈ నెల 3న ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించి, గుండెపోటుతో హఠాన్మరణానికి గురైంది.
Go Back to Shorts
Gujarath
Jain
Fasting
Died
Hospital

More Telugu News