లండన్ విమానాశ్రయంలో రజనీకాంత్ కుమార్తె, అల్లుడికి షాక్.. పాస్ పోర్టులున్న సూట్ కేస్ మాయం !
- లండన్ వెళ్లిన సౌందర్య, విశాకన్ దంపతులు
- లక్షల డాలర్లు సహా పాస్ పోర్టులున్న సూట్ కేస్ మాయం
- తాత్కాలిక పాస్ పోర్టును ఇచ్చిన దౌత్యాధికారులు
దీంతో వారిద్దరూ విమానాశ్రయంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్ పోర్టులు లేని వారిని అధికారులు బయటకు పంపేందుకు నిరాకరించి, వారిని ఎయిర్ పోర్ట్ గెస్ట్ హౌస్ కు పంపారు. ఆపై ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, లండన్ లోని భారత దౌత్యాధికారులను సంప్రదించి, వారికి సాయపడాలని కోరారు. దీంతో స్పందించిన అధికారులు, ఎయిర్ పోర్టుకు చేరుకుని, విశాకన్, సౌందర్యలకు తాత్కాలిక పాస్ పోర్టులను అందించారు. సూట్ కేస్ మాయమైన ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.