సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీశ్ ను హత్య చేసింది హేమంతే!: డీసీపీ వెల్లడి
- కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవల జరిగిన హత్య
- ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సతీశ్, ఫ్రెండ్ హేమంత్ పార్టనర్స్
- సతీశ్ తో బాగా తాగించి ఇనుప రాడ్ తో కొట్టి హత్య
సతీశ్ తో ఫుల్ గా మద్యం తాగించి ఐరన్ రాడ్ తో సతీశ్ తలపై హేమంత్ కొట్టాడని, ఆపై కత్తితో అతని గొంతు కోసి హత్య చేశాడని తెలిపారు. సతీశ్ శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేందుకు హేమంత్ విఫలయత్నం చేసినట్టు హేమంత్ ను విచారణ చేయగా తెలిసిందని పేర్కొన్నారు. సతీశ్ మృతదేహాన్ని ప్యాక్ చేసేందుకు కొన్ని కవర్లు కూడా హేమంత్ తీసుకొచ్చాడని, అయితే, ప్యాక్ చేయడం సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేశాడని, అన్ని ఆధారాలు సేకరించాకే హేమంత్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు. కాగా, ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సతీశ్, హేమంత్ పార్టనర్స్. తన భర్త సతీశ్ కనిపించడం లేదంటూ అతని భార్య గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది.