దత్తాత్రేయ ఇంట్లో కలకలం రేపిన చిన్నపాటి కత్తి.. భద్రత కట్టుదిట్టం
- దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించిన కేంద్రం
- ఆయన ఇంటికి పెరిగిన అభిమానుల తాకిడి
- నిన్న ఫొటోలు దిగుతున్న సమయంలో తోపులాట
నిన్న కూడా దత్తన్న ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వీరంతా మధ్యాహ్నం 12 గంటల సమయంలో దత్తాత్రేయతో ఫొటోలు దిగుతున్న సమయంలో స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ పెన్సిల్ కట్టర్ (చిన్న కత్తి) కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దానిని గుర్తించిన కార్యకర్తలు భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన తర్వాత దత్తాత్రేయ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.