పంజాబ్ లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది మృతి
- ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారుచేస్తుండగా ఘటన
- 30 మందికి తీవ్ర గాయాలు
- ఫ్యాక్టరీలో మరో 50 మంది
ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారుచేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ దుర్ఘటనపై గుర్దాస్పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ట్వీట్ చేశారు. బటాలా ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.