వరుస సినిమాలు చేయనున్న సంపూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుస సినిమాలు చేయనున్న సంపూ

  • 'కొబ్బరిమట్ట'తో హిట్ కొట్టిన సంపూ 
  • క్రిష్ నిర్మాణంలో ఒక సినిమా 
  • సి.కల్యాణ్ నిర్మాతగా మరో సినిమా
'కొబ్బరి మట్ట'తో సంపూర్ణేష్ బాబు నటుడిగా మరోమారు తన విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలలో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా దర్శక నిర్మాతలే సంపూతో మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. పూర్తి హాస్యభరితమైన కథను సిద్ధం చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

ఇక దర్శకుడు క్రిష్ కూడా నిర్మాతగా సంపూతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక నిర్మాత సి.కల్యాణ్ కూడా సంపూతో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించిన ప్రకటన చేస్తాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి వరుస సినిమాలతో సంపూ ఫుల్ బిజీ అవుతున్నాడన్న మాట.
sampoo

More Telugu News