ఇప్పటి హీరోల తీరుపై టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పటి హీరోల తీరుపై టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన

  • ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాంటి అవార్డు ఇచ్చినా వచ్చి తీసుకునేవారన్న టీఎస్సార్
  • ఇప్పటి హీరోలు సీనియర్లను ఫాలో కావడంలేదని వ్యాఖ్యలు
  • హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కళా ప్రేమికుడు
ప్రముఖ వ్యాపారవేత్త, కళా ప్రేమికుడు టి.సుబ్బరామిరెడ్డి త్వరలో తన పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించారు. సహజనటి జయసుధకు అభినయ మయూరి అవార్డు ఇస్తున్నట్టు తెలిపారు. దీనిపై హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా తన పుట్టినరోజైన సెప్టెంబరు 17న అనేక గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఈసారి జయసుధకు అవార్డు ప్రదానం చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది వస్తున్నారని వివరించారు.

అయితే, ఇప్పటితరం హీరోలు అవార్డులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోడం తనను బాధిస్తోందని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రహీరోలు ఎలాంటి అవార్డు ఇచ్చినా వచ్చి తీసుకునేవారని, ఇప్పటి హీరోలు అవార్డుల విషయంలో సీనియర్లను అనుసరించడంలేదని అన్నారు. కొందరు సినీ కళను తక్కువ చేసి మాట్లాడుతుంటారని, అయితే అనేక శాఖల్ని తనల్లో కలుపుకున్న సినిమా భగవంతుడి సృష్టిలో ఎంతో గొప్ప కళ అని టీఎస్సార్ అభిప్రాయపడ్డారు.
TSR
Tollywood
Jayasudha

More Telugu News