ఏ ప్రభుత్వం కూడా నంది అవార్డుల గురించి పట్టించుకోవడం లేదు: మురళీమోహన్
- నంది అవార్డులపై మురళీమోహన్ ఆవేదన
- ఇప్పుడు అవార్డుల గురించి మాట్లాడేవాళ్లే లేరన్న సీనియర్ నటుడు
- ప్రస్తుత ప్రభుత్వమైనా నంది అవార్డులు ప్రకటించాలని విజ్ఞప్తి
నంది అవార్డులు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవని, ప్రభుత్వం ఇచ్చే అవార్డులంటే గొప్పగా చెప్పుకుంటారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. అయితే కొంతకాలంగా ఈ అవార్డులను పట్టించుకోవడం మానేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సిన అవార్డులను ప్రదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.