బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో వేసిన స్పెల్ భయంకరం... అలాంటి బౌలింగ్ ఇంతకు ముందెప్పుడూ చూడలేదు: కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో వేసిన స్పెల్ భయంకరం... అలాంటి బౌలింగ్ ఇంతకు ముందెప్పుడూ చూడలేదు: కోహ్లీ

  • కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్
  • ఈ స్థాయిలో రాణించడం మామూలు విషయం కాదన్న కోహ్లీ
  • బుమ్రా ఫామ్ లో ఉంటే తొలి ఐదారు ఓవర్లలోనే డ్యామేజ్ చేసేస్తాడని కితాబు
భీకరమైన ఫామ్ లో ఉన్న టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టి20 ఆటగాడిగా ముద్ర పడిన ఓ క్రికెటర్ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తుండడం మామూలు విషయం కాదని అన్నాడు. ఒక ఆటగాడిపై ఫలానా ఫార్మాట్ కే పనికొస్తాడని ముద్రవేయడం ఎంత తప్పో బుమ్రా నిరూపించాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తాజాగా వెస్టిండీస్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా వేసిన స్పెల్ భయంకరం అని, అలాంటి బౌలింగ్ ను తాను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని అన్నాడు.

బుమ్రా ఫామ్ లో ఉన్నాడంటే తొలి ఐదారు ఓవర్లలోనే సగం పని ఫినిష్ చేసేస్తాడని కోహ్లీ కితాబిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేయాలని కోరుకున్న బుమ్రా, క్రమశిక్షణ, అంకితభావంతో తనను తాను మలుచుకున్నాడని కొనియాడాడు. బుమ్రా ట్రయినింగ్, అతడు తీసుకునే ఆహారం చాలా ప్రత్యేకంగా ఉంటుందని వివరించాడు. అలాంటి ఫాస్ట్ బౌలర్ తన జట్టులో ఉండడం లక్కీగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.
Bumrah
Virat Kohli

More Telugu News