సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వెరైటీ పాత్రల గురించి పూజా హెగ్డే 
  • చిరంజీవి, కొరటాల చిత్రం అప్ డేట్ 
  • అక్టోబర్లో సందీప్ కిషన్ ఎంటర్ టైనర్ 
*  వెరైటీ పాత్రలు చేయాలని ఉందనీ, వాటి కోసం ఎదురుచూస్తున్నానని అంటోంది అందాలతార పూజా హెగ్డే. 'మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. అందుకే ఏదైనా సినిమాలో ఎవరైనా మంచి పాత్ర చేస్తే అది నాకు ఎందుకు రాలేదబ్బా? అని ఆలోచిస్తాను. అలాంటి పాత్ర నాకు వస్తే బాగుండేది కదా అనుకుంటాను. అయితే, నేను కెరీర్ మొదలుపెట్టింది ఇప్పుడే కదా, అలాంటి పాత్రలు చేయడానికి నాకు చాలా సమయం వుంది కదా అని నాకు నేను సర్ది చెప్పుకుంటాను" అని చెప్పింది పూజ.
 *  'సైరా' చిత్రం తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ఈ ప్రాజక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం కోసం ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ ను తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాస్ట్యూమ్స్ ఎంపిక చేస్తున్నారట.
*  సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' చిత్రం షూటింగును పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎంటర్ టైనర్ ను వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు. ఇందులో హన్సిక హీరోయిన్ గా నటించింది.    
Pooja Hegde
Chiranjivi
Koratala Siva
Hansika

More Telugu News