నాగ్ ప్లేస్‌లో రమ్యకృష్ణ.. ప్రేక్షకులను కట్టిపడేసిన ‘శివగామి’
- బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం స్పెయిన్ వెళ్లిన నాగ్
- సడన్ ఎంట్రీతో ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ
- ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన
‘నా మాటే శాసనం’ అంటూ రెడ్ కలర్ శారీలో వచ్చిన రమ్యకృష్ణ తొలుత నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పింది. అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినా ఆ జోరును రమ్యకృష్ణ ఆ తర్వాత కొనసాగించలేకపోయిందని అంటున్నారు. ముందుగా రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నట్టుగా ఉంది తప్ప సహజంగా చేస్తున్నట్టు అనిపించలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అయితే, టీవీ ముందు కూర్చున్న ప్రేక్షుకులు మాత్రం రమ్యకృష్ణ బాగా చేసిందని చెబుతున్నారు. మరోవైపు, రమ్యకృష్ణ రాకతో హౌస్‌మేట్స్‌లో కూడా జోష్ కనిపించింది.