పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పేశారు తండ్రీకొడుకులు... ఉస్కో అంటే వాటికి మొరగటమొక్కటే తెలుసు: విజయసాయిరెడ్డి
- ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి
- చంద్రబాబు ఇసుక మాఫియాను పెంచిపోషించారంటూ వ్యాఖ్యలు
- బడితె పూజ తప్పదంటూ వ్యంగ్యం
ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ తండ్రీకొడుకులు గొలుసులు విప్పి వదిలేశారని, అవి దారినపోయే వాళ్ల వెంటపడుతున్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆయన ఉస్కో అంటే మొరగటమొక్కటే వాటికి తెలుసని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజ తప్పదని మర్చిపోయినట్టున్నారంటూ చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ ముగించారు.