ఢిల్లీ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.. ఎన్ఆర్సీ అమలు చేస్తాం: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

  • ఢిల్లీలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులు చాలా మంది ఉన్నారు
  • వీరితో ఢిల్లీకి చాలా ప్రమాదకరం
  • ఢిల్లీలో కూడా ఎన్ఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉంది
అసోం ఎన్ఆర్సీ (జాతీయ పౌర జాబితా) ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. 19 లక్షల మందికి పైగా పౌరులు భారతీయులు కాదని ఈ జాబితాలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో, ఎంపీ, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కూడా చట్ట విరుద్ధంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య ఎక్కువగానే ఉందని... పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని... ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో కూడా ఎన్ఆర్సీని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

చట్ట విరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులతో ఢిల్లీకి ప్రమాదం ఉందని తివారీ అన్నారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మనోజ్ తివారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Go Back to Shorts
Delhi
NRC
BJP
Manoj Tiwari

More Telugu News