ఏపీ పీఎస్సీ గ్రూప్-2 ప్రధాన పరీక్ష పేపర్ పై విమర్శలు.. స్థాయికి తగ్గా ప్రశ్నలు లేవంటున్న అభ్యర్థులు
- గురు, శుక్రవారాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహణ
- మైనస్ మార్కులున్నా 130 ప్రశ్నలకు ఈజీగా సమాధానాలు చెప్పేలా పేపర్
- పేపర్-3లో ఇండియన్ ఎకానమీపై అత్యధిక ప్రశ్నలు
అయితే.. ఏపీ, ఇండియన్ ఎకానమీపై మూడో పేపర్లో అడిగిన ప్రశ్నలు మాత్రం కొంత కఠినంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు. బ్యాంకులు, జీడీపీపై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. నిజానికి ఏపీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి సమపాళ్లలో ప్రశ్నలు అడగాల్సి ఉండగా, ఇండియన్ ఎకానమీపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కొన్ని ప్రశ్నలు అభ్యర్థుల స్థాయికి మించి ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, గ్రూప్-2 ప్రధాన పరీక్షకు 5,770 మంది అంటే 94.49 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.