సంచలన గాయని రాణు మోండాల్ కు సల్మాన్ ఖాన్ ఇంటిని కానుకగా ఇవ్వలేదు: రానాఘాట్ క్లబ్
- రైళ్లలో పాటలు పాడే రాణు మోండాల్ కు బాలీవుడ్ చాన్స్
- సల్మాన్ రూ.55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడంటూ కథనాలు
- వాటిల్లో నిజం లేదంటున్న అమ్రా శోభాయ్ షోయితన్ క్లబ్ సభ్యులు
రాణు మోండాల్ ప్లాట్ ఫామ్ పై పాడుతుండగా వీడియో తీసి వాట్సాప్, ఫేస్ బుక్ లో ప్రచారం చేసింది ఈ క్లబ్ సభ్యులే. సల్మాన్ ఖాన్ ఆమెకు ఇల్లును కానుకగా ఇచ్చినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఇది సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ మాత్రమేనని క్లబ్ సభ్యుడైన వికీ బిశ్వాస్ తెలిపారు.
ఇదే కాకుండా రాణు గురించి అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని, ఆమె రూ.15 లక్షల ఖరీదు చేసే ఇంటిని కొనుగోలు చేసిందని, బిగ్ బాస్ షో నుంచి పిలుపు వచ్చిందని, ఓ సాంగ్ రికార్డు చేసినందుకు హిమేశ్ రేషమ్మియా ఆమెకు రూ.50 లక్షలు ఇచ్చినట్టు అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయని బిశ్వాస్ వెల్లడించారు. హిమేశ్ ఆమెకు ఎంతో సాయం చేసిన మాట నిజమే అయినా, ప్రచారంలో ఉన్న కథనాలు మాత్రం కల్పితాలని పేర్కొన్నారు.