నాకు పొగరెక్కువని అనుకోవడానికి అదో కారణం కావచ్చు: సీనియర్ హీరోయిన్ జమున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు పొగరెక్కువని అనుకోవడానికి అదో కారణం కావచ్చు: సీనియర్ హీరోయిన్ జమున

  • నాకు అహంకారం లేదు 
  • నాపై ఆ పాత్రల ప్రభావం ఉండొచ్చు 
  • నన్ను అందాల తారగా చూశారు
తెలుగు తెరపై అందాల కథానాయికగా ఒక వెలుగు వెలిగిన జమున, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. "జమునకి పొగరెక్కువ .. అహంకారి .. గర్విష్టి అని కొంతమంది అనుకునేవాళ్లు. నేను వేసిన పాత్రలు ఆ తరహావే కావడం వల్లనే నాకు ఈ టైటిల్స్ పెట్టడానికి కారణమై ఉండొచ్చునని నేను అనుకుంటూ వుంటాను. ఆ పాత్రల ప్రభావం కూడా నాపై ఉండొచ్చునేమో.

నిజంగానే నేను గర్విష్టినైతే సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో ఉండగలిగే దానినా? 40 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో వున్నాను. 25 సంవత్సరాల పాటు ఏకధాటిగా హీరోయిన్ గా చేశాను. హీరోయిన్ గా చేస్తోన్న సమయంలో నా శరీరాకృతిలో మార్పులు రావడంగానీ, అవకాశాలు తగ్గడంగాని జరగలేదు. ప్రేక్షకులు నన్ను ఓ అందాల తారగా మాత్రమే చూడటానికి ఇష్టపడ్డారు. అందువల్లనే నేను అమ్మ .. అత్త పాత్రలు ఎక్కువగా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.
Jamuna

More Telugu News