ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావును కాల్చి చంపినా తప్పులేదు: రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి
  • ప్రభాకర్ రావు అబద్ధాలు చెబుతున్నారు
  • ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం వెనుక ఆదాని హస్తం ఉంది
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు అబద్ధాలు చెబుతున్నారని, ఆయన్ని గన్ పార్క్ ముందు నిలబెట్టి కాల్చి చంపినా తప్పులేదంటూ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలు లేవని టీఆర్ఎస్ బుకాయిస్తోందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి తెర వెనుక ఆదాని, తెరముందు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉన్నాయని ఆరోపించారు. ఛత్తీస్ గఢ్ తో దీర్ఘకాల ఒప్పందంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం అని ఈఆర్సీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కొనుగోళ్లను తప్పుబట్టారని గుర్తుచేశారు.
Go Back to Shorts
Tsspdcl
Cmd
prabhakar rao
congress
Revanth

More Telugu News