'డిస్కోరాజా' విడుదల తేదీ ఖరారు

  • విభిన్నమైన కథాంశంతో 'డిస్కోరాజా'
  • అలరించనున్న ముగ్గురు కథానాయికలు 
  • డిసెంబర్ 20న విడుదల
విభిన్నమైన కథాకథనాలను తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్, రవితేజ హీరోగా 'డిస్కోరాజా' సినిమా చేస్తున్నాడు. ఈ కథ కూడా పూర్తి వైవిధ్యభరితమైనదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తితో అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనుండటం విశేషం. పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ ఆయన సరసన జత కడుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ హీరోగా రవితేజ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Raviteja
Nabha Natesh
Payal
Tanya Hope

More Telugu News