ఒక్క పాటతో సెలబ్రిటీగా మారిన రాణు మోండాల్ కు సల్మాన్ ఖాన్ కళ్లు చెదిరే కానుక!
- రైళ్లలో పాటలు పాడే రాణు మోండాల్ కు యావత్ దేశం నీరాజనాలు
- బాలీవుడ్ చాన్స్ ఇచ్చిన హిమేశ్ రేషమ్మియా
- రూ.55 లక్షల ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చిన సల్మాన్ ఖాన్!
ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దాంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ హిమేశ్ రేషమ్మియా తన కొత్త చిత్రంలో ఓ పాట కూడా పాడించాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా రాణు మోండాల్ ప్రతిభకు ముగ్ధుడైపోయాడు. ఆమె గాత్రంతో ఫిదా అయిన భాయ్ ఏకంగా రూ.55 లక్షల విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. అంతేకాదు, తన దబాంగ్-3 సినిమాలో కూడా రాణు మోండాల్ తో ఓ పాట పాడించాలని సల్మాన్ ప్లాన్ చేస్తున్నాడట.