డీఎస్సీ-2012 అభ్యర్థులకు న్యాయం చెయ్యాలి
డీఎస్సీ2012 అభ్యర్థులకు న్యాయం చెయ్యాలంటూ ప్రభుత్వ పరీక్షల విభాగం ముందు నిరుద్యోగులు కదం తొక్కారు. ముందుగా ప్రకటించిన జాబితా ప్రకారం ఉద్యోగాలు కల్పించకుండా సవరించిన జాబితా ప్రకారం ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మంత్రి పార్థసారధి పదోతరగతి ఫలితాలు విడుదల చేస్తున్న సమయంలోనే వీరు గేటు బయట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వీర్ని అదుపులోకి తీసుకున్నారు.