ఆ ఎంపీల కాళ్లను ఆమె ముద్దుపెట్టుకునేది.. కలెక్టర్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
- కలకలం రేపుతున్న మధ్యప్రదేశ్ ఎంపీ కేపీ యాదవ్ వ్యాఖ్యలు
- ఆమె ఊరూరు తిరిగి ఎంపీ కాళ్లను ముద్దు పెట్టుకుంది
- రైతుల సమస్యను పరిష్కరించకుంటే ఇక్కడే బైఠాయిస్తా
‘‘ఆమె గతంలో అన్ని గ్రామాలు సందర్శించేది. ఎంపీలను కలిసి వాళ్ల కాళ్లను ముద్దాడేది. ఈ రోజు ఒక ఎంపీ స్వయంగా వచ్చి మాట్లాడుతున్నారు. ఆమె వచ్చి సమస్యను పరిష్కరించకుంటే నేనిక్కడే బైఠాయిస్తా’’ అని యాదవ్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాపై యాదవ్ విజయం సాధించారు. కాగా, కలెక్టర్‌పై ఆయన చేసిన దారుణ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.