ఏఎంబీ సినిమాస్ కు 'బెస్ట్ మల్టీప్లెక్స్' అవార్డు... ఆనందంతో పొంగిపోతున్న మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏఎంబీ సినిమాస్ కు 'బెస్ట్ మల్టీప్లెక్స్' అవార్డు... ఆనందంతో పొంగిపోతున్న మహేశ్ బాబు!

  • బిగ్ సినీ అవార్డ్స్-2019లో పురస్కారం అందుకున్న ఏఎంబీ సినిమాస్
  • ఇటీవలే ప్రారంభమైన ఏఎంబీ సినిమాస్
  • అవార్డు రావడం పట్ల సిబ్బందికి శుభాభినందనలు తెలిపిన మహేశ్ బాబు
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు ఇటీవలే ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కమర్షియల్ ప్రయోజనాలే కాకుండా సామాజిక సేవల పరంగానూ ఏఎంబీ సినిమాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ఛారిటీ కార్యక్రమాల కోసం ఉచితంగా సినిమాల ప్రదర్శనలతో మహేశ్ బాబు ఆశయాలకు అనుగుణంగా నడుస్తోంది. తాజాగా, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ కు బెస్ట్ మల్టీప్లెక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.

బిగ్ సినీ అవార్డ్స్-2019లో భాగంగా తమ మల్టీప్లెక్స్ కు అవార్డు రావడం పట్ల మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. పట్టరానంత ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ శుభసమయాన ఏఎంబీ సినిమాస్ సిబ్బందికి తన హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సిబ్బంది భాగస్వామ్యం, శ్రమ ఫలితమే ఈ అవార్డు అని మహేశ్ బాబు పేర్కొన్నారు.
AMB Cinemas
Mahesh Babu
BigCineAwards

More Telugu News