సుజనా చౌదరి గారూ, మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే: విజయసాయిరెడ్డి

  • ట్విట్టర్ లో విజయసాయి వ్యాఖ్యలు
  • రాజ్యసభ సభ్యుడు అయ్యేందుకు చంద్రబాబుకు కప్పం కట్టారంటూ ఆరోపణ
  • ఈ విషయం ఢిల్లీలోనూ అందరికీ తెలుసంటూ విమర్శలు
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడు అయ్యేందుకు చంద్రబాబుకు ఎంత కప్పం చెల్లించారో అందరికీ తెలుసని, ఢిల్లీలోనూ ఈ విషయం విదితమేనని ట్వీట్ చేశారు. అలాంటి చరిత్ర ఉన్న మీరు ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు. అయినా, మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే కదా సుజనా చౌదరి గారూ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Sujana Chowdary
Andhra Pradesh
Chandrababu

More Telugu News