నా స్టార్ డమ్ గురించి మా ఇంట్లో తెలిసింది తక్కువ: హీరో బాబీ సింహా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా స్టార్ డమ్ గురించి మా ఇంట్లో తెలిసింది తక్కువ: హీరో బాబీ సింహా

  • మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం 
  • జాబ్ చేస్తూనే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని
  • అమ్మానాన్నలు వ్యవసాయం పనులు చూస్తుంటారన్న బాబీ సింహా
తమిళంలో స్టార్ హీరోగా బాబీ సింహా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించి ప్రస్తావించాడు. "మొదటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ, అలా వచ్చిన డబ్బుతో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. ఈ కారణంగా నేను ఎక్కడా నిలకడగా జాబ్ చేసేవాడిని కాదు. కారణం మా అమ్మానాన్నలకు తెలిసేది కాదు.

వాళ్లు కొడై కెనాల్ లో వ్యవసాయం పనులు చూసుకుంటూ వుంటారు. వాళ్లు ఇంకా నేను చేసిన కొన్ని సినిమాలు చూడలేదు. నా స్టార్ డమ్ గురించి వాళ్లకి పూర్తిగా తెలియదు. కావాలనే నేను తెలియనీయలేదు. ఇల్లు కొన్నాను .. కారు తీసుకున్నాను అని చెబుతానుగానీ, అందుకు ఎంత అయిందనేది చెప్పను. అందువలన 'ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయా .. ఫరవాలేదా?' అని అడుగుతుంటారు" అని బాబీ సింహా నవ్వేశాడు.

Bobby Simha

More Telugu News