నాకు ఫైనల్ ఫోబియా ఉందన్న వాళ్లకు ఇదే నా సమాధానం: పీవీ సింధు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఫైనల్ ఫోబియా ఉందన్న వాళ్లకు ఇదే నా సమాధానం: పీవీ సింధు

  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ కైవసం చేసుకున్న సింధు
  • గతంలో తనపై అదే పనిగా విమర్శలు గుప్పించారన్న తెలుగుతేజం
  • వాళ్లందరికీ తన రాకెట్ తోనే బదులిచ్చానంటూ వెల్లడి
తెలుగుతేజం పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించడం తెలిసిందే. తాను సాధించిన ఘనతపై సింధు స్పందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో ఫైనల్లో ఓటమి అనంతరం తనపై చాలా విమర్శలు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత తాను చాలా టోర్నీల్లో ఫైనల్స్ లో ఓడిపోవడంతో తనకు ఫైనల్ ఫోబియా ఉందన్న వ్యాఖ్యలు వినిపించాయని తెలిపింది. అలాంటి విమర్శలు చేసిన వారందరికీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్లో తాను సాధించిన విజయమే సమాధానం అని సింధు పేర్కొంది. అదే పనిగా తనపై విమర్శలు గుప్పించారని, వాటన్నింటికి తన రాకెట్ తోనే బదులిచ్చానని గర్వంగా చెప్పింది. 
PV Sindhu
BWF

More Telugu News