నేడు మోదీ-ట్రంప్ ల భేటీ.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలు
- భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు భేటీ
- 40 నిమిషాలపాటు కొనసాగనున్న సమావేశం
- జీ7 దేశాల సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన మోదీ
ఫ్రాన్స్ లో జీ7 దేశాల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో భారత్ కు సభ్యత్వం లేకపోయినప్పటికీ... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తిగత ఆహ్వానంపై ట్రంప్ ఆ సదస్సులో ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. మరోవైపు, గతంలో ఈ కూటమి జీ8గా ఉండేది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్, కెనడాలు సభ్యదేశాలుగా ఉండేవి. అయితే, 2014లో ఈ గ్రూపు నుంచి రష్యాను బహిష్కరించడంతో జీ8 కాస్తా... జీ7 అయింది. తాజాగా, రష్యాను తిరిగి కూటమిలో కలుపుకోవడానికి జీ7 దేశాధినేతలు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.