మళ్లీ కొండారెడ్డి బురుజు సెంటర్ లోకి మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ కొండారెడ్డి బురుజు సెంటర్ లోకి మహేశ్ బాబు!

  • మహేశ్ తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'
  • హైదరాబాద్ లోని స్టూడియోలో సెట్
  • రూ. 4 కోట్లతో సెట్ వేసిన నిర్మాతలు
కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్... మహేశ్ బాబుకు తొలి సూపర్ డూపర్ హిట్ ను అందించిన 'ఒక్కడు' చిత్రంలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రకాశ్ రాజ్ తో మహేశ్ చేసిన ఫైట్ హైలైట్. ఆపై మళ్లీ కొండారెడ్డి బురుజు సెంటర్ మరోసారి మహేశ్ సినిమాలో కనిపించలేదు.

ఇప్పుడు తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం అదే బురుజు అవసరమైంది. 'ఒక్కడు' కోసం బురుజు వద్దే షూటింగ్ నిర్వహించగా, తాజా చిత్రం కోసం దాదాపు రూ. 4 కోట్ల వ్యయంతో అదే విధమైన సెట్ ను హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో నిర్మించారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, మహేశ్ బాబులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రష్మిక హీరోయిన్ గా 'దిల్‌' రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేశ్ స్వయంగా సినిమాను నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Mahesh Babu
Sarileru Neekevvaru
Kondareddy Buruju
Set

More Telugu News