బ్రిటన్ ప్రధాని బోరిస్ పై ప్రశంసలు కురిపించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్!
- ఫ్రాన్స్ లోని పారిస్ లో జీ7 సదస్సు
- సమావేశమైన బ్రిటన్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు
- ఈ ఏడాది అక్టోబర్ లోపు బ్రెగ్జిట్ కు గడువు
దీంట్లో దాదాపు 51.9 శాతం మంది ఓటర్లు ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంతో బ్రిటన్ ప్రధాని థెరీసా మే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నెల రోజుల క్రితం బోరిస్ జాన్సన్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ డీల్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరప్ దేశాల నుంచి బ్రిటన్ కు భారీగా వలసలు జరుగుతున్నాయనీ, తద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని పలువురు బ్రిటిషర్లు నిరసన తెలపడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.