చరిత్రలో తొలిసారి... స్పేస్ స్టేషన్ నుంచి స్నేహితురాలి బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యోమగామి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరిత్రలో తొలిసారి... స్పేస్ స్టేషన్ నుంచి స్నేహితురాలి బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యోమగామి!

  • నాసా అధీనంలో ఉన్న స్పేస్ కంప్యూటర్లు
  • తోటి ఆస్ట్రనాట్ ఖాతాను హ్యాక్ చేసిన సుమ్మర్ వార్డెన్
  • ఫిర్యాదు చేసిన అన్నే మెక్ క్లెయిన్
ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అంతరిక్షం నుంచి ఓ వ్యోమగామి మరో వ్యోమగామి బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేశాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి ఇది జరిగింది. సుమ్మర్ వార్డెన్ అనే ఆస్ట్రొనాట్ తన మాజీ సహచరురాలు అన్నే మెక్ క్లెయిన్ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేయగా, ఆమె ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని 'న్యూయార్క్ టైమ్స్' తన ప్రత్యేక కథనంలో తెలిపింది. మెక్ క్లయిన్ పై గుర్తింపు చోరీ, అనధికారంగా ఖాతాలోకి చొరబాటు అభియోగాలపై కేసు నమోదైంది.

నాసా అధీనంలోని కంప్యూటర్ల నుంచి తన ఖాతాను హ్యాక్ చేశారని వార్డెన్ ఫిర్యాదు చేశారు. తాను ఐఎస్ఎస్ లో పని చేస్తున్న వేళ, కొన్నిసార్లు ఖాతాను తెరచానని, ఆ వివరాలను తెలుసుకున్న వార్డెన్, తన ఖాతాను హ్యాక్ చేశాడన్న ఆమె ఆరోపణలపై ఇప్పుడు అధికారులు ఫిర్యాదు చేశారు. తాను, సుమ్మర్ వార్డెన్ తో కలిసి ఆరు నెలల పాటు ఐఎస్ఎస్ లో పని చేశామన్నారు. కాగా, ఆమె చేసిన ఆరోపణలను ఐఎస్ఎస్ ఉన్నతాధికారులు తిరస్కరిస్తుండటం గమనార్హం. డిసెంబర్ 3, 2018న సూయజ్ రాకెట్ లో మెక్ క్లయిన్ ఐఎస్ఎస్ కు వెళ్లి, తన సహచరుడు నిక్ హాగ్ తో కలిసి తొలిసారి స్పేస్ వాక్ చేశారు.
Space
ISS
Bank Account
Hack

More Telugu News