జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు

  • టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డు
  • 11 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్న బుమ్రా
  • ఇప్పటివరకు షమీ, వెంకటేశ్ ప్రసాద్ పేరిట ఉన్న రికార్డు
  • 13 టెస్టుల్లో 50 వికెట్లు తీసిన షమీ, వెంకీ
టీమిండియాలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే ప్రధాన బౌలర్ గా ఎదిగిన జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. భారత్ తరఫున తక్కువ టెస్టుల్లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా బుమ్రా రికార్డు పుటల్లోకెక్కాడు. బుమ్రా కేవలం 11 టెస్టుల్లోనే 50 వికెట్లు తీయడం విశేషం అని చెప్పాలి.

ఇప్పటివరకు ఈ రికార్డు మహ్మద్ షమీ, వెంకటేశ్ ప్రసాద్ ల పేరిట ఉంది. షమీ, వెంకీ ఇద్దరూ కూడా 13 టెస్టుల్లో 50 వికెట్లు సాధించారు. అయితే 25 ఏళ్ల బుమ్రా వీరికంటే రెండు టెస్టులు తక్కువగా ఆడి ఈ ఘనత నమోదు చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోను అవుట్ చేయడం ద్వారా 50వ వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు.
Bumrah
India
Test
Cricket
Record

More Telugu News