మీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని రావద్దు: మోదీకి అరుణ్ జైట్లీ కుటుంబం వినతి

  • అబూదాబిలో ఉన్న మోదీ
  • జైట్లీ భార్య, కుమారుడిని ఫోన్ ద్వారా పరామర్శించిన పీఎం
  • షెడ్యూల్ ప్రకారం టూర్ ముగించుకుని రావాలని కోరిన జైట్లీ కుటుంబసభ్యులు
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం అబూదాబిలో ఉన్న మోదీ జైట్లీ భార్య, కుమారుడికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మూడు దేశాల పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని రావద్దని ఈ సందర్భంగా వారు విన్నవించారు. షెడ్యూల్ ప్రకారం టూర్ ను ముగించుకుని రావాలని కోరారు.

మరోవైపు, అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఆయన నివాసంలో అందరి సందర్శనార్థం ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. రేపు మధ్యాహ్నం జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి.
Go Back to Shorts
Arun Jaitly
Family
Modi
BJP

More Telugu News