మిషన్ కాకతీయపై కేంద్రం ప్రశంసలు కురిపించింది!: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కొందరు వ్యక్తులు దీనిపై తప్పుడు ప్రచారం చేశారు
- నీతిఆయోగ్ మిషన్ కాకతీయకు జై కొట్టింది
- ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
నీతిఆయోగ్ నివేదికను ఇటీవల విడుదల చేసిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మిషన్ కాకతీయ సాగుతున్న తీరుపై ప్రశంసలు కురిపించిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో 22,500 చెరువులను పునరుద్ధరించామనీ, రాష్ట్రంలో చెరువులపై ఆధారపడి జరిగే సాగు 51.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్.. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు.