గోల్డ్ చెయిన్ మింగేసిన దొంగ... పోలీసులకు దివ్యమైన ఐడియా ఇచ్చిన డాక్టర్లు!
- రాజస్థాన్ లో ఘటన
- మహిళ మెడలో చెయిన్ కొట్టేసి పోలీసుల రాకతో మింగేసిన చైన్ స్నాచర్
- డజను అరటిపండ్లు, రెండు బొప్పాయి పండ్లతో గొలుసును బయటికి రాబట్టిన పోలీసులు
అయితే పోలీసుల రాకతో ఆ దొంగ అతి తెలివి ప్రదర్శించి గొలుసు మింగేశాడు. తాను గొలుసు దొంగతనం చేయలేదంటూ బుకాయించాడు. దాంతో ఆ దొంగను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీయించడంతో మిలమిలా మెరిసిపోతూ గొలుసు కనిపించింది. కానీ ఆ బంగారు గొలుసును బయటికి తీయడం ఎలా? అంటూ మల్లగుల్లాలు పడుతున్న పోలీసులకు అక్కడి డాక్టర్లు చాలా సింపుల్ ఐడియా ఇచ్చారు.
డజను అరటిపండ్లు, రెండు బొప్పాయి కాయలు తెప్పించి, ఆ దొంగతో తినిపించాలని చెప్పారు. ఆ పండ్లు తినేందుకు దొంగ మొండికేయగా, బలవంతంగా అన్నింటిని అతడి నోటిలో కుక్కారు. ఇంకేముంది, బాగా మగ్గిన పండ్లు వాటిపని అవి చేసేశాయి. ఆ మరునాటి ఉదయం బంగారు గొలుసు బయటికి వచ్చేసింది.