ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలా?: చంద్రబాబు
- జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు
- రీటెండరింగ్ వల్ల పోలవరంకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది
- పోలవరంతో ప్రయోగాలు వద్దని మేము ముందు నుంచీ చెబుతున్నాం
టెండర్లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఎన్నో సార్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే... ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతుందని, తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేక రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.