వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో పవన్ కల్యాణ్ క్యారెక్టర్?

  • సినిమాను తెరకెక్కిస్తున్న ఆర్జీవీ
  • ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజ్
  • ఆ పాత్ర ఏంటో ఊహించాలని వర్మ హింట్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను వర్మ ఇప్పటికే విడుదల చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయడం దగ్గరి నుంచి గతంలో జరిగిన రాజకీయ పరిణామాల వరకూ అన్నింటిని ఈ సినిమాలో చూపించబోతున్నారని ఈ సినిమా యూనిట్ చెబుతోంది.

ఈ నేపథ్యంలో వర్మ ఈరోజు ఫన్నీ ట్వీట్ చేశారు. తాను తీస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఈ కొత్త నటుడు (పవన్ కల్యాణ్ లా వున్నాడు) తన సినిమాలో ఏ పాత్ర పోషించబోతున్నాడో ఊహించగలరా? అని నెటిజన్లకు సవాలు విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వర్మ, పవన్ కల్యాణ్ ను పోలిన వ్యక్తి ఫోటోను షేర్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Tollywood
KAMMA RAJYAMLO KADAPA REDDLU
RGV
Pawan Kalyan
Jana Sena
Twitter

More Telugu News