Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీరకట్టే నెపంతో అసభ్య ప్రవర్తన... షోరూమ్ సూపర్ వైజర్ కు ఏడాది జైలు!

  • కూకట్ పల్లి వై-జంక్షన్ లో షోరూమ్
  • సూపర్ వైజర్ గా పనిచేస్తున్న యాదగిరి
  • జైలుశిక్షతో పాటు జరిమానా విధించిన న్యాయమూర్తి
చీరను ఎలా కట్టుకోవాలో తనకు తెలియదని చెప్పిన అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ షూరూమ్ సేల్స్ సూపర్ వైజర్ కు ఏడాది జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే, వికారాబాద్‌ జిల్లా, కోట్‌ పల్లికి చెందిన చింతకింది యాదగిరి (27), కూకట్‌ పల్లి వై- జంక్షన్‌ లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌ సూపర్‌ వైజర్‌ గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం జూలై 31న ఓ విద్యార్థిని చీరను కొనేందుకు వెళ్లింది. ఓ చీరను సెలక్ట్ చేసుకుని, అది తాను ధరిస్తే, ఎలా ఉంటుందో చూపాలని కోరగా, యాదగిరి ఆమెకు చీరను కట్టే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, యాదగిరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన కూకట్‌ పల్లి 8ఎ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి కేసును విచారించి, నిందితుడికి ఏడాది జైలుశిక్ష, రూ. 2 వేల జరిమానా విధించారు.
Kukatpalli
Showroom
Sarry
Jail

More Telugu News