అమలాపురంలో వైద్య యువతి కిడ్నాప్ నకు యత్నం... ధైర్యంగా తప్పించుకున్న వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమలాపురంలో వైద్య యువతి కిడ్నాప్ నకు యత్నం... ధైర్యంగా తప్పించుకున్న వైనం!

  • కిమ్స్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతి
  • పాత పరిచయంతో కిడ్నాప్ నకు యత్నం
  • పోలీసు స్టేషన్ ను చూసి బైక్ పై నుంచి దూకేసి తప్పించుకున్న యువతి
మెడిసిన్ లో పీజీ చేస్తున్న యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేయబోగా, ఆమె చాకచక్యంతో తప్పించుకున్న ఘటన అమలాపురంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి కిమ్స్ వైద్య కాలేజీలో అనపర్తి ప్రాంతంలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన యువతి పీజీ వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఆమెకు బెంగళూరులో ఉంటున్న అవినాశ్ అనే యువకుడితో గతంలో పరిచయం ఉంది. యువతికి ఇటీవలే వివాహం నిశ్చయం కాగా, ఆ విషయం తెలుసుకున్న అనినాశ్, ఆమెను కలిసేందుకు తన మిత్రుడు అజయ్ తో కలిసి కిమ్స్ ఆసుపత్రి వద్దకు కారులో వచ్చాడు. మాట్లాడాలంటూ అమ్మాయిని ఎక్కించుకుని అయినవిల్లి వైపు తీసుకెళ్లాడు.

అవినాశ్ తనకు హాని తలపెట్టవచ్చని అప్పటికే ఆమెకు అనుమానం వచ్చింది. దాన్ని మరింత బలపరిచేలా, కారు యానాం సమీపంలోకి వెళ్లగానే, అప్పటికే తాను సిద్ధం చేసుకున్న బైక్ పై యువతిని ఎక్కించుకుని, కారును అజయ్ తో పంపించేశాడు. బైక్ పై అతనితో వస్తున్న అమ్మాయి, ఐ.పోలవరం పోలీసు స్టేషన్ దగ్గరకు రాగానే, అమాంతం బైక్ పై నుంచి దూకేసింది. ఈ ఘటనను పోలీసులు చూడగా, అవినాశ్... వేగంగా బైక్ ను పోనిచ్చాడు. కిందపడ్డ ఆమెను పోలీసులు లేవదీశారు. ఆపై విషయమంతా తెలుసుకుని, అమలాపురం డీఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. డీఎస్పీ ఆదేశాలపై అవినాశ్ స్నేహితుడిగా వచ్చిన అజయ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు, పరారైన అవినాష్‌ కోసం గాలిస్తున్నారు.
KIMS
Amalapuram
Kidnap
Police

More Telugu News