సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వర్కౌట్స్ మొదలెట్టిన సమంత 
  • 'క్షణం' దర్శకుడి మరో చిత్రం
  • 'ఉప్పెన'లో చేరిన విజయ్ సేతుపతి  
*  'ఓ బేబీ' చిత్రం తర్వాత కథానాయిక సమంత ఇప్పుడు ఓ వెబ్ సీరీస్ లో నటిస్తున్న సంగతి విదితమే. ఇటీవలే చెన్నైలో దీని షూటింగ్ కూడా కొంత భాగం జరిగింది. కాగా, ఈ పాత్ర కోసం సమంత ప్రస్తుతం జిమ్ లో తీవ్రంగా వర్కౌట్స్ చేస్తూ, బాడీ షేప్ కోసం ప్రయత్నిస్తోందట.
*  'క్షణం' ఫేం రవికాంత్ పేరెపు తన తాజా చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో చేస్తున్నాడు. 'కృష్ణ అండ్ హిజ్ లీల' పేరిట రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటిస్తున్నారు.
*  'సైరా' సినిమా తర్వాత తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు మరో తెలుగు సినిమా 'ఉప్పెన' చిత్రం షూటింగులో జాయిన్ అయ్యాడు. సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
Samantha
O.. Baby
Vijay Sethupati
Vaishnav Tej

More Telugu News