తిరుగులేని శక్తిగా బీజేపీ.. పక్క పార్టీలకు వణుకు పుట్టించేంతగా కొత్త సభ్యత్వాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుగులేని శక్తిగా బీజేపీ.. పక్క పార్టీలకు వణుకు పుట్టించేంతగా కొత్త సభ్యత్వాలు!

  • పార్టీ సభ్యత్వాల విషయంలో దూసుకుపోయిన బీజేపీ
  • కొత్తగా దాదాపు 4 కోట్ల సభ్యత్వాలు
  • దాదాపు 15 కోట్లకు చేరుకున్న మొత్తం సభ్యత్వాలు
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యతతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... మరింత బలపడే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వాల విషయంలో దూసుకుపోయింది. తాజాగా దాదాపు 4 కోట్ల మంది బీజేపీలో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. దీంతో, బీజేపీ సభ్యత్వాలు 14.78 కోట్లకు చేరుకున్నాయి.

బీజేపీలో 3,78,67,753 మంది కొత్తగా సభ్యత్వాలు తీసుకున్నారని ఓ ప్రకటనలో ఆ పార్టీ వెల్లడించింది. జూలై 6న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్నటితో (ఆగస్ట్ 20) ముగిసిందని తెలిపింది. కొత్త సభ్యత్వాలతో కలిపి బీజేపీ మొత్తం సభ్యత్వాలు 14,78,67,753కు చేరుకున్నాయని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లో 55 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారని చెప్పింది.

తొలుత 2 కోట్ల కొత్త సభ్యత్వాలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ... ఆ తర్వాత టార్గెట్ ను 4 కోట్లకు పెంచింది. అనుకున్నట్టుగానే తన టార్గెట్ ను బీజేపీ చేరుకోవడం గమనార్హం. ఊహించని విధంగా బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు.
BJP
Membership

More Telugu News