Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ చేతికి ధరించిన వాచ్ గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్న ఫ్యాన్స్!

  • సాహో చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రభాస్
  • ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేతికి ఆకర్షణీయమైన వాచ్ తో కనిపించిన ప్రభాస్
  • అది హబ్లోట్ కంపెనీ వాచ్ అని తెలుసుకున్న ఫ్యాన్స్!
బాహుబలి-2 తర్వాత రెండున్నరేళ్ల గ్యాప్ తో వస్తున్న ప్రభాస్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. సాహో చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ ట్రెండీ లుక్స్ తో అందరినీ అలరిస్తున్నాడు. అయితే, ప్రభాస్ చేతికి ధరించిన వాచ్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. రామోజీ ఫిలింసిటీలో జరిగిన సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ చేతికి వాచీతో హాజరయ్యాడు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల్లో ప్రభాస్ తో పాటు చేతికున్న వాచ్ కూడా హైలైట్ అయింది. దాంతో అభిమానులు ఆ వాచ్ ఏ కంపెనీది, రేటెంత అంటూ గూగుల్ పై వాలిపోయారు. మొత్తానికి అది హబ్లోట్ కంపెనీ వాచ్ అని, ఖరీదు సుమారుగా రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఉండొచ్చని తెలుసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు చెందిన ఏ గ్రూప్ లో చూసినా ఈ వాచ్ గురించే చర్చించుకుంటున్నారు.
Prabhas
Watch

More Telugu News