Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీనియర్ డైరెక్టర్ ను సైతం లెక్కచేయని భానుమతి: సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్

  • భానుమతిగారికి స్వాభిమానం ఎక్కువ
  • తమిళ దర్శకుడు అంతమాట అనేశాడు 
  • ఆ దర్శకుడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారన్న ఈశ్వర్
భానుమతితో మంచి సాన్నిహిత్యం వున్న సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ఆమె ధోరణి గురించి ప్రస్తావించారు. "భానుమతిగారి వ్యక్తిత్వం చాలా చిత్రంగా అనిపిస్తుంది. చాలామంది ఆమెకి గర్వం అనుకుంటారు గానీ ఆమెకి స్వాభిమానం ఎక్కువ.

అప్పట్లో ఒక తమిళ దర్శకుడు లేడీ ఆర్టిస్టులను చాలా తక్కువగా చూసేవాడు. లేడీ ఆర్టిస్టులను 'ఏమే' అనే పిలిచేవాడు. అయితే ఆయన చాలా సీనియర్ డైరెక్టర్ కావడం వలన ఎవరూ ఏమీ మాట్లాడేవారు కాదు. ఒకసారి ఆ తమిళ దర్శకుడి సినిమాలో భానుమతిగారు నటించవలసి వచ్చింది. అలవాటు ప్రకారం ఆ సీనియర్ దర్శకుడు ఆమెను 'ఏమే డైలాగ్ చూసుకున్నావా?' అని అడిగాడు. దాంతో వెంటనే భానుమతిగారు 'ఏంట్రా డైలాగ్ చూసుకునేది' అంటూ, లేడీ ఆర్టిస్టులతో ఎలా మర్యాదగా నడచుకోవాలనే విషయంపై లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆ దర్శకుడు తన ధోరణి మార్చుకున్నాడు" అని చెప్పుకొచ్చారు.
Bhanumathi

More Telugu News