Kothapalli Subbarayudu: వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడి కుమారుడు కన్నుమూత!
- మానసిక ఎదుగుదల సరిగ్గా లేని నారాయణ నాయుడు
- నిన్న వీల్ చైర్ నుంచి కుప్పకూలడంతో ఆసుపత్రికి
- బిడ్డ మరణాన్ని తట్టుకోలేకున్న కొత్తపల్లి
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడి కుమారుడు నారాయణ రాయుడు (35) మృతిచెందారు. ఇంట్లో అందరూ ముద్దుగా చంటిబాబూ అని పిలుచుకునే నారాయణ నాయుడికి చిన్నతనం నుంచి మానసిక ఎదుగుదల సరిగ్గా లేదు. వీల్ చైర్ లో ఉన్న నారాయణ, నిన్న మధ్యాహ్నం కుప్పకూలగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
కుమారుడి మరణ వార్తను విన్న కొత్తపల్లి దంపతులు బోరున విలపించారు. చంటిబాబు భౌతికకాయాన్ని నరసాపురం, రుస్తుంబాదలోని కొత్తపల్లి నివాసానికి తరలించారు. గత 35 ఏళ్లుగా సుబ్బారాయుడి సతీమణి, కేవలం తన బిడ్డకే సమయాన్ని కేటాయించారు. చంటిబాబు మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా, ఆయన్ను ఓదార్చేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు వైసీపీ నేతలు ఆయన్ను పరామర్శించి, సంతాపం తెలిపారు.